రివ్యూ: నీ జతగా నేనుండాలి

nee-jathaga-nenundali-revieబాలీవుడ్‌ మ్యూజికల్‌ బ్లాక్‌ బస్టర్‌ ఆషికి2 ను బండ్ల గణేష్‌ తెలుగులో రీమేక్ చేస్తున్నారనగానే ఆ మూవీ ఫ్యాన్స్‌ అందరు అవసరమా అనుకున్నారు. ఇక ఇందులో సచిన్‌ హీరోగా నటిస్తున్నాడనే వార్త విని షాక్‌ అయ్యారు. ఆషికి 2ను రీమేక్ కాదు..పేరడీ చేస్తారేమోనని ఫీలయ్యారు. అందుకు తగ్గట్టుగానే ఈ సినిమా సాంగ్స్‌, ట్రైలర్స్‌ ఉండటంతో నీజతగా నేనుండాలి సినిమాపై తెలుగు ఆడియెన్స్‌ అంతగా ఇంట్రెస్ట్‌ చూపించలేదు. ఇక హీరోగా నచిన్‌ జోషి ఇప్పటికై తెలుగులో మూడు..హిందీలో మరో మూడు సినిమాలు చేసినా అందులో ఒక్కటంటే ఒక్కటి కూడా సక్సెస్‌ అయిందిలేదు.వీటి వల్ల సచిన్ కు ఓ వందకోట్ల వరకు లాస్ వచ్చినా..పట్టు వదలని బట్టి విక్రమార్కుడిలా మళ్లీ ఆషికి2 రీమెక్‌తో ఆడియెన్స్‌ ముందుకు వచ్చాడు.అయితే గతంతో పోలిస్తే ఈ సారి సచిన్‌ చేసిన ఈ ప్రయత్రం కాస్త పర్వాలేదనిపించింది.

కధ విషయానికి వస్తే.. పాపులర్ పాప్‌సాంగర్‌ గా పేరున్న రాఘవ్‌ జయరామ్‌(సచిన్) తాగుడుకు బానిపై తనకున్న పేరుప్రఖ్యాతలను పోగొట్టుకుంటాడు.లండన్‌,న్యూయార్క్‌ లలో షోష్ చేసిన రాఘవ్‌ డబ్బులకోసం గోవాలోకూడా పాటలు పాడే స్ధాయికి దిగజారతాడు.ఆ టైమ్లోనే అతనికి ఓ బార్‌లో గాయత్రినందన(నజియా) పరిచయమవుతుంది. గాయత్రి పాట విని నచ్చి ఆమెను పెద్ద సింగర్‌ గా ప్రమోట్‌ చేసెందుకు అవకాశం కల్పిస్తాడు. ఓ పక్క గాయత్రి టాప్‌ సింగర్‌గా ఎదుగుతుంటే.మరో పక్క రాఘవ్‌ తాగుడు వల్ల పతనమవుతుంటాడు. రాఘవ్‌ ను ప్రేమించిన గాయత్రి తన కెరీర్‌ను పక్కన పెట్టి రాఘవ్‌ను మామూలు మనిషిగా మార్చెందుకు సిద్దమవతుంది. అయితే తన వల్ల గాయత్రి కెరీర్ డిస్టర్బ్‌ అవతుందని తెలిసిన రాఘవ్‌ చివరికి ఏలాంటి నిర్ణయం తీసుకున్నాడనేది నీ జతగా నేనుండాలి చిత్రకధ..

ఆషికి2 ను తెలుగులోకి రీమేక్‌ చేసే క్రమంలో కదలోనూ, కధనంలోనూ దర్శకుడు ఏలాంటి మార్పులు చేసిందిలేదు. పైగా హిందీ వెర్షెన్‌ స్టోరి బోర్డ్‌ని చూసి సీన్‌ టూ సీన్‌ ఫ్రేమ్‌ టూ ఫ్రేమ్‌ దించేయటం తప్ప.. ఈ సినిమాకోసం ప్రత్యేకంగా చేసింది ఏమిలేదు. అసలు ఈ సినిమాను రీమేక్‌ చేయటం కంటే, ఓరిజినల్‌ వెర్షెన్‌ను డబ్బింగ్‌ చేసి రీలీజ్ చెస్తే సరిపోయేదనిపిస్తుంది. ఎందుకంటే ఆషికి2 కధ గొప్పదికానున్నా..అందులోని లీడ్ ఆర్టిస్ట్ లు ఆదిత్య రాయ్‌కపూర్‌,శ్రద్దా కపూర్‌ ల కెమిస్ట్ర్రీ ,అంకిత్‌ తివారీ సంగీతం ఈ చిత్రాన్ని సూపర్ హిట్‌గా నిలబెట్టాయి.ఈ రీమెక్‌లో ప్రదాన మైనస్‌ లీడ్‌ ఆర్టిస్ట్‌లే కావటంతో ఆడియెన్స్‌ ఈ సినిమాకు కనెక్ట్‌ కాలేకపోయారు.

సచిన్‌ రాఘవ్‌ జైరాం గా ఆదిత్య రామ్‌ కపూర్‌ను ఫాలో అవ్వటానికై ట్రై చేశాడు తప్ప తనదైన శైలిలో నటనను ప్రదర్శించలేదు.ఓ విదంగా అది కాస్త బేటరనిపించింది. ఇక ఓరిలినల్‌ వెర్షన్‌కు శ్రద్దా ఎంత ప్లస్‌ అయిందో..ఈ రీమెక్‌లో నజియా అంత మైనస్‌ అయింది.అయితే సచిన్‌ కంటే చాలా సన్నివేశాల్లో నజియానే బాగా చేసిందన్న ఫీలింగ్‌ ఆడియెన్స్‌ను కలుగుతుంది. మిగతా పాత్రలలో రావురమేష్‌ ,శశాంక్‌ తమ పాత్రల పరిది మేరకు నటించారు.

దర్శకుడు జయరవీంద్ర మాత్రం ఓరిలినల్‌ వెర్షెన్‌ ను మక్కీకిమక్కీ దింపేసినా..ఆ రిచ్‌నెస్‌ను, ఫీల్‌ను కూడా కరెక్ట్ గా క్యారీ చేయగలిగాడు. అసలీ రీమెక్‌ను జయరవీంద్ర హ్యాండిల్‌ చేయగలడా అని అందరు బావించారుకానీ..తన వరకు దర్శకుడు పాస్‌ మార్కులను వేయించుకున్నాడు.ఇక పాటల విషయానికి వస్తే..ఆల్రెడీ సూపర్‌హిట్‌ సాంగ్స్‌ ..వాటికి తెలుగు లిరక్స్‌ రాశారు.అయితే..అక్కడ కూడా హిందీ లిరిక్స్‌ను అనువదించటమే కాస్త ఇబ్బందినిపిస్తుంది. అన్నింటిని మించి వసంత్‌ సినిమాటోగ్రఫి ఈ సినిమాకున్న బిగ్గెస్ట్‌ ప్లస్‌పాయింట్‌.

ఓవరాల్‌గా ఆషికి2 సినిమాను చూడని ప్రేక్షకులు ఏవరైనా ఉంటే ఈవారం వేరే ఏ కోత్త సినిమా లేదు కనుక..సినిమా కుటుంబమంతా కలిసి చూడదగ్గ విదంగా క్లీన్ గా ఉంది గనుక..నీ జతగా నేనుండాలి సినిమాను ఏలాంటి అంచానాలు లేకుండా ఓసారి చూడోచ్చు.

తెలుగు మిర్చి రేటింగ్స్ : 2.5/5                                               – స్వాతి

***ఈ సమీక్షలు, రేటింగులూ కేవలం మా అభిప్రాయం మాత్రమే… ఇది ప్రేక్షకాభిప్రాయం అని చెప్పబోవటం లేదు. సినిమా కమర్షియల్ జయాపజయాలకు ఈ రివ్యూలకు సంబంధం లేదు.