రివ్యూ : పవర్

power-review
                                                    |Click here for English Review| 
లో ఓల్టేజ్  : పవర్ 
గతేడాది బలుపు సినిమాతో హీరోగా కాస్త చెప్పుకోదగ్గ విజయాన్ని అందుకున్న రవితేజ దాన్ని నిలుపుకునెందుకు సంవత్సరం గ్యాప్ తీసుకుని చేసిన చిత్రం ‘పవర్’. బలుపు సినిమాకు కధను అందించిన బాబినే దర్శకుడిగా ఎంచుకుని చేసిన ఈ సినిమాలో రవితేజ విక్రమార్కుడు అనంతరం మరోసారి పవర్ఫుల్ పోలీసాఫీసర్గా నటించాడు.. ట్రైలర్ రిచ్గా ఉండటం ..పాటలు బాగుండటంతో స్వతహాగానే పవర్ పై ఆడియెన్స్ లో అంచనాలు ఏర్పడ్డాయి.. మరీ పవర్ అంచనాలను అందుకుందో లేదో ఓ సారి చూద్దాం…

పోలీస్ డిపార్ట్మెంట్లో పక్కా అవినీతి పరుడిగా పేరొందిన ఎసిపి బల్దేవ్ ఆశా ఫౌండేషన్ పేరు చెప్పి అవినీతిపరుల వ్యాపారంలో వాటాలడుగుతుంటాడు. ఈ విషయంలో స్యయానా హోంమినిస్టర్, అతని తమ్ముళ్లతోనే ఢీలింగ్ చెసుకున్న బల్దేవ్ వారికి కావలసిన ఓ ఇంపార్టెంట్ వ్యక్తిని ఓ హత్య కేసులో కీలకమైన సాక్షిని వెతికి తెస్తానని మాటిస్తాడు.. అయితే బల్దేవ్ ఇలా అవినీతి చేయటానికి వెనుక ఓ సదుద్దేశం ఉంటుంది.. ఇంతకీ ఏంటా ఉద్దేశ్యం.. బల్దేవ్ కి అతనిలా కనిపించే తిరిపతికి లింక్ ఏంటి. వీరు చేసే పనులు..వేసే ప్లాన్ల వల్ల బలయింది ఏవరనేదే మిగతా కధ. ఇందులోనే ఓ రెండు లవ్ స్టోరీలు.. ఓ రెండు సెంటిమెంట్ ఏపిసోడ్లు.. నాలుగు డబుల్ మీనింగ్ డైలాగ్లు. మరో నాలుగు పాత సినిమాల పాయింట్లను పట్టుకుని దర్శకుడు ఈ పవర్ సినిమాను నడిపించాడు..

హీరోగా రవితేజ ఈ సినిమాలో రెండు షేడ్స్ ఉన్న పాత్రలో తనదైన స్టైయిల్ నటించేశాడు..కానీ గత సినిమాల్లో ఉన్న ఎనర్జీ పవర్ లో పెద్దగా కనిపించలేదు. హీరోయిన్ హన్సిక మూడు పాటలు.. మూడు సీన్లు మినహా చేయటానికి..పెద్దగా ఏమీ లేదు. మరో హీరోయిన్ రెజీనా పరిస్ధితి మరీ ఘోరం.. ఆమెకు ఓ పాట.. ఓ నాలుగు సీన్లను ఇచ్చి సరిపెట్టెశారు. బ్రహ్మానందం, పోసాని ఉన్నంతలో కాస్త నవ్వించారు. ఇక మిగతా పాత్రలలో ప్రకాష్ రాజ్, కోట అజయ్,సుబ్బరాజు,సంపత్, ముఖేష్ ఋషి పాత్రల పరిధి మేరకు నటించారు.

దర్శకుడు ఈ సినిమా కథను పక్కాగా రవితేజను దృష్టిలో పెట్టుకుని రాసినట్టున్నాడు. ఎందుకంటే ఎక్కువ శాతం పవర్ సినిమా చూస్తుంటే మనకు విక్రమార్కుడు సినిమా తరహా ప్లేవర్ కనిపిస్తుంటుంది. తాను రాసుకున్న కధను తెరపై తీసుకురావటంలో బాబి సఫలీకృతుడైనా.. కధనంలోని లోపాలు వల్ల పవర్ ప్రేక్షకులకు బోర్ కోట్టిస్తుంది. ఫస్టాఫ్ లో, క్లైమాక్స్ లో బ్రహ్మానందం తో రవితేజ చేసే కామెడీ బావున్నా..ఓవరాల్ గా సినిమా చాలా చోట్ల గాడి తప్పింది. డైలాగులు ఓకె.

టెక్నికల్ గా జయనన్ విన్సెంట్ సినిమాటోగ్రఫీ పవర్ కు ప్రధానమైన ప్లస్ పాయింట్. తమన్ పాటలు బాగున్నా.. ఆర్.ఆర్ హిసాత్మకంగా ఉంది. ప్రొడక్షన్‌ వాల్యూస్ పర్వాలేదు. ఓవరాల్ గా ఈ పవర్ ప్రేక్షకులకు పెద్దగా కనెక్ట్ అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. వచ్చేవారం ఆగడు వచ్చేస్తుంది కానీ.. ఓ వేళ ఆగడు రాకున్నా పవర్ వారం కంటే ఎక్కువగా ఆడే చాన్సయితే కనిపించటంలేదు..

తెలుగు మిర్చి రేటింగ్స్ : 2.75/5            – స్వాతి

***ఈ సమీక్షలు, రేటింగులూ కేవలం మా అభిప్రాయం మాత్రమే… ఇది ప్రేక్షకాభిప్రాయం అని చెప్పబోవటం లేదు. సినిమా కమర్షియల్ జయాపజయాలకు ఈ రివ్యూలకు సంబంధం లేదు.

                                        |Click here for English Review|