రివ్యూ : ఓటర్ – నిరుత్సాహ పరిచాడు..

స్టార్ కాస్ట్ : మంచు విష్ణు, సురభి, సంపత్ రాజ్ తదితరులు..
దర్శకత్వం : జి కార్తీక్ రెడ్డి
నిర్మాతలు: జాన్‌ సుధీర్‌ పూదోట
మ్యూజిక్ : యస్ తమన్
విడుదల తేది : జూన్ 21, 2019
తెలుగు మిర్చి రేటింగ్ : 2/5

రివ్యూ : ఓటర్ – నిరుత్సాహ పరిచాడు..

మంచు వార‌బ్బాయి విష్ణు ప్ర‌ధాన పాత్ర‌లో .. జీఎస్ కార్తీక్ ద‌ర్శ‌క‌త్వంలో రామా రీల్స్ బ్యాన‌ర్‌పై జాన్ సుధీర్ నిర్మించిన చిత్రం ఓటర్. తెలుగు, త‌మిళంలో ఈరోజు (జూన్ 21) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో విష్ణు స‌ర‌స‌న సుర‌భి క‌థానాయిక‌గా నటించగా..సంపత్ రాజ్ , పోసాని కృష్ణ మురళి తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. మరి గత కొంతకాలంగా హిట్ లేని విష్ణు ఈ సినిమా ఎలా కలిసొచ్చింది..? అసలు ఎలాంటి ప్రమోషన్ లేకుండా థియేటర్స్ లోకి వచ్చిన ఈ చిత్రానికి ప్రేక్షకుల ఆదరణ ఎలా ఉంది..? అసలు ఈ సినిమా కథ ఏంటి..? ఈ చిత్రం తో విష్ణు ట్రాక్ లోకి వచ్చినట్లేనా..? అనేది ఇప్పుడు చూద్దాం.

కథ :

గౌతమ్ (మంచు విష్ణు) అమెరికా లో జబ చేస్తుంటాడు. తన ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం ఇండియా కు వస్తాడు. ఆలా ఇండియా కు వచ్చిన గౌతమ్ ..సురభి ని చూసి ప్రేమించడం మొదలుపెడతాడు. కానీ గౌతమ్ ప్రేమకు సురభి చిన్న టాస్క్ ఇస్తుంది. ఆ టాస్క్ పూర్తి చేస్తేనే ప్రేమిస్తానని కండిషన్ పెడుతుంది. మరి సురభి పెట్టిన టాస్క్ ఏంటి..? ఆ టాస్క్ లో గౌతమ్ గెలిచాడా లేదా..? సెంటరల్ మినిస్టర్ (సంపత్ రాజ్) కు గౌతమ్ కు ఎందుకు గొడవ వస్తుంది..? ఇవన్నీ తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

ప్లస్ :

* ‘రీకాల్ ఎలెక్షన్’ పాయింట్

* పోసాని ట్రాక్

మైనస్ :

* సెకండ్ హాఫ్

* స్లో నేరేషన్

న‌టీన‌టుల పెర్పామెన్స్ :

* మంచు విష్ణు యాక్టింగ్ లో కొత్తదనం ఏమి లేదు…గత చిత్రాలకంటే కాస్త భిన్నంగా కనిపించాడు అంతే. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ కావడం తో కాస్త పొలిటికల్ డైలాగ్స్ తో ఆకట్టుకున్నాడు.

* సురభి గ్లామర్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. విష్ణు – సురభి మధ్య వచ్చే లవ్ ట్రాక్ ఒకేలా అనిపిస్తుంది.

* సెంట్రల్ మినిస్టర్ గా సంపత్ రాజ్ మెప్పించాడు.

* పోసాని తన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నాడు. ఫస్ట్ హాఫ్ అంత ఈయన కామెడీ ని ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేయచ్చు.

* మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు.

సాంకేతిక విభాగం :

* మ్యూజిక్ విషయానికి వస్తే..ఈ సినిమానే చాలామంది కి తెలియదు ఇక ఈ సినిమా మ్యూజిక్ గురించి చెప్పడానికి ఏముంటుంది. కాకపోతే తమన్ సాంగ్స్ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది నేపధ్య సంగీతం బాగుంది.

* అశ్విన్ సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలోని చాలా సన్నివేశాలను మంచి విజువల్స్ తో చాలా అందంగా చూపించారు.

* ప్రవీణ్ కె ఎల్ ఎడిటింగ్ కు ఇంకాస్త పని చెపితే బాగుండు. సినిమాలో చాల సాగతీత సన్నివేశాలు ఉండడం తో ప్రేక్షకులు బోర్ గా ఫీల్ అయ్యారు.

* నిర్మాత జాన్‌ సుధీర్‌ పూదోట నిర్మాణ విలువులు బాగున్నాయి.

ఇక డైరెక్టర్ కార్తీక్ రెడ్డి విషయానికి వస్తే తాను రాసుకున్న కథ బాగున్నప్పటికీ తెరపై చూపించడంలో విఫలం అయ్యాడు. కథనంలో అక్కడక్కడ లోటుపాట్లు కనిపించాయి. బలమైన కాన్‌ఫ్లిక్ట్ లేకపోవడంతో సెకండాఫ్‌లో సినిమా డౌన్ అయ్యింది. అలాగే కాస్ట్ & క్రూ విషయంలోనూ డైరెక్టర్ విఫలం అయ్యాడు.

కొన్ని రాజకీయ సన్నివేశాల ఆకట్టుకున్నప్పటికీ.. సినిమా మాత్రం ఆసక్తికరంగా తెరకెక్కించలేకపోయాడు. రాజకీయ నాయకుల గురించి ప్రస్తావించిన అంశాలు అలాగే ఫస్ట్ హాఫ్ లో పోసాని కామెడీ ట్రాక్ బాగున్నప్పటికీ..మిగతంతా బోర్ కొట్టించాడు. ఓవరాల్ గా ఓటర్ గా ఫెయిల్ అయ్యాడు.

తెలుగు మిర్చి రేటింగ్ : 2/5

Click here for English Review