మేకప్ వేసుకున్న చంద్రబోస్

చంద్రబోస్ యాక్టర్ గా మారారు. ‘తుగ్లక్‌’ సినిమాలో ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారాయన. ఈ పాత్రకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ని దర్శకుడు హరీశ్‌ శంకర్‌ విడుదల చేశారు. కళ్లజోడు పెట్టుకుని సీరియస్‌గా కనిపిపించారు చంద్రబోస్‌. ఈ చిత్రంలోని ‘యే జిందజీ’ అనే పాటలో నటించిన దృశ్యాల్నీ విడుదల చేశారు.  

ఈ చిత్రాన్ని రోహన్‌ సిద్ధార్థ్‌, సుమన్‌ శెట్టి, చైతన్య ప్రియ ప్రధాన పాత్రల్లో ప్రణీత్‌ పండగ తెరకెక్కిస్తున్నారు. గీతా టాకీస్‌ పతాకంపై పరమ గీతా నల్లెబోయిన నిర్మిస్తున్నారు. అనిల్‌ నందూరి, మహేశ్‌ ధీరా మ్యూజిక్.