రాధే శ్యామ్ కు థమన్ మ్యూజిక్ ..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం జిల్ ఫేమ్ రాధాకృష్ణ డైరెక్షన్లో రాధే శ్యామ్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న ఈ మూవీ ని గోపి కృష్ణ మూవీస్ , యూవీ క్రియేషన్స్ లు సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. శుక్రవారం ఈ చిత్ర ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి అబిమానుల్లో ఆనందం నింపారు.

ఈ ఫస్ట్ లుక్ ఆలా వచ్చిందో లేదో సోషల్ మీడియా లో అభిమానులు రచ్చ మొదలు పెట్టారు. ఎన్నాళ్లగానో ఊరిస్తున్న అప్డేట్ రావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్వీట్స్ మరియు రీట్వీట్స్ తో దుమ్మురేపాడు. ఇదిలా వుంటే ఈ చిత్రానికి సంగీత ద‌ర్శ‌కుడు అంటూ ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ ఫిక్స్ కాలేదు. విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన సెన్సేష‌న‌ల్ మూవీ డియర్ కామ్రేడ్‌ ఈ చిత్రానికి త‌మిళ యంగ్ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ జ‌స్టిన్ ప్ర‌భాక‌ర‌న్ సంగీతం అందించాడు. అత‌ని చేత రాధేశ్యామ్ కోసం చిత్ర బృందం రెండు పాట‌లు చేయించింది. వాటి రికార్డింగ్ కూడా పూర్త‌యింది. అయితే సినిమా నేప‌థ్య సంగీతానికి, మిగ‌తా పాట‌ల‌కు సంగీతం ఎవ‌రు స‌మ‌కూరుస్తార‌నేది మాత్రం ఇప్ప‌టికీ స‌స్పెన్సే.

ఇప్ప‌టి వ‌ర‌కు 70 శాతం చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి త‌మ‌న్ అయితే బాగుంటుంద‌ని మేక‌ర్స్ భావిస్తున్నార‌ట‌. టీసిరీస్ సంస్థ కూడా ఈ చిత్రానికి స‌హ భాగ‌స్వామిగా వ్యవ‌హ‌రిస్తుండ‌టంతో ఈ ప్ర‌పోజ‌ల్‌ని యువీ వారి ముందు పెట్టిన‌ట్టు వినికిడి.