శర్వానంద్ ఒకేఒక జీవితం ..

హిట్ , ప్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్తున్న శర్వానంద్..ప్రస్తుతం తన 30 వ సినిమా తో బిజీ గా ఉన్నాడు. శ్రీ కార్తిక్ దర్శకుడిగా ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అవుతున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్ ఆర్ ప్రకాశ్ బాబు – ఎస్ ఆర్ ప్రభు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి ఒకే ఒక జీవితం అనే టైటిల్ ను ఫిక్స్ చేసారు.

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచిరెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్ న యూ రిలీజ్ చేశారు. ఈ వీడియో చాలా ఇంట్రస్టింగ్ గా అనిపిస్తోంది. ఈ వీడియోలో పాట పాడటానికి ఆది ని స్టేజ్ మీదకు పిలుస్తుండగా.. హీరోయిన్ కూడా వెళ్లి పాడమని ప్రోత్సహిస్తుంది. స్టేజ్ దగ్గర క్రౌడ్ గోల చేస్తుండగా.. మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ గిటార్ ను చూపించారు. అలాగే ఓ టేప్ రీకార్డర్ ను చూపిస్తూ..కొన్ని సైన్స్ ఫిక్షన్ అంశాలతో వీడియోను డిజైన్ చేశారు. ఈ సినిమాకు ‘పెళ్లి చూపులు’ దర్శకుడు తరుణ్ భాస్కర్ డైలాగ్స్ అందిస్తున్నారు. రీతువర్మ హీరోయిన్ గా నటిస్తుంది. https://www.youtube.com/embed/S1nkO8Tz0sA