అలిపిరి బాంబు దాడి కేసులో ఇద్దరికి జైలు

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పై అలిపిరిలో జరిగిన బాంబు దాడి కేసులో ఇద్దరికి శిక్ష ఖరారైంది. నాగార్జున, రామస్వామికి ఏడేళ్ల జైలు శిక్ష విధించారు. మావోయిస్టు నేత సాగర్, గంగిరెడ్డిలను నిర్దోషులుగా ప్రకటిస్తూ తిరుపతి నాల్గో అదనపు జిల్లా జడ్జి ఈశ్వర్ రావు తీర్పునిచ్చారు. 2003 అక్టోబర్ 1న చంద్రబాబు నాయుడుపై మావోయిస్టులు తిరుపతిలోని అలిపిరి వద్ద బాంబు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ దాడిలో బాబుతో పాటు పార్టీ సీనియర్ నేతలు రెడ్డివారి రాజశేఖర రెడ్డి, బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి, చదలవాడ కృష్ణమూర్తి తదితరులు గాయపడ్డారు.