‘అమిగోస్’ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది..


విలక్ష‌ణ‌మైన పాత్ర‌ల్లో న‌టిస్తూ త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు సంపాదించుకున్నారు నంద‌మూరి హీరో క‌ళ్యాణ్ రామ్. గతేడాది ‘బింబిసార’ బ్లాక్‌బస్టర్ తర్వాత నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ యాక్షన్ చిత్రం ‘అమిగోస్’. ఈ చిత్రంలో ఆయన త్రిపాత్రిభిన‌యంలో నటించారు. రాజేంద్ర రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఇక ఆషిక రంగనాథ్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రి 10న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలయింది.అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరైన విజయాన్ని అందుకోలేకపోయింది.. కానీ సినిమా చూసినవారికి మాత్రం మంచి ట్రీట్ ఇచ్చింది అని చెప్పాలి. ఇప్పుడీ చిత్రం ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌కు సంబంధించి అధికారికంగా ప్రకటన వచ్చింది. ప్రముఖ ఓటీటీ వేదిక నెటిఫ్లిక్స్‌ ‘అమిగోస్’ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఏప్రిల్‌ 1 వ తేదీ నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్‌ కానుంది.

మెగాహీరో కోసం ‘మిస్ యూనివర్స్’ !