తమిళంలో ఇంట్రీ ఇస్తున్న వకీల్ సాబ్ బ్యూటీ

వకీల్ సాబ్ మూవీ తో పాపులర్ అయినా అనన్య నాగళ్ల..వరుస అవకాశాలతో అదరగొడుతుంది. ఓ పక్క సినిమాలు చేస్తూనే..మరోపక్క సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ అభిమానులకు టచ్ లో ఉంటుంది. తాజాగా ఈ భామకు తమిళనాట ఛాన్స్ వచ్చినట్లు సమాచారం.

శశికుమార్‌ సినిమాలో కీలక పాత్ర పోషించేందుకు అనన్యా సెలెక్ట్‌ అయ్యారు. ‘తమిళ డెబ్యూ’ అంటూ సోషల్‌ మీడియాలో పూజా కార్యక్రమాల ఫొటోలు చేశారామె! టైమ్‌ ట్రావెల్‌ నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి ‘అంజల’ చిత్రం ఫేమ్‌ తంగం పా శరవణన్‌ దర్శకత్వం వహించనున్నారు. త్వరలో ఈ చిత్రం సెట్స్‌ మీదకెళ్లనుంది.