ఎన్టీఆర్ కోసం త్రివిక్రమ్ మాస్టర్ ప్లాన్..నాగ్ హీరోయిన్ ను దింపుతున్నాడు

ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కలయికలో ఎన్టీఆర్ 30 వ చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో ఉన్న ఎన్టీఆర్..అది పూర్తి కాగానే త్రివిక్రమ్ మూవీ సెట్ లో జాయిన్ కానున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. కాగా ఈ మూవీ లో మన్మధుడు హీరోయిన్ ను తీసుకరాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

2002లో వచ్చిన ‘మన్మథుడు’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అన్షు.. ను ఈ మూవీ లో తీసుకుంటున్నారట. ‘మన్మథుడు’ సినిమాకు త్రివిక్రమ్ రచయిత. ఈ పరిచయంతో ఇటీవల అన్షును సంప్రదించారట త్రివిక్రమ్. పాత్ర నచ్చడంతో అన్షు కూడా చేయడానికి అంగీకరించారని అంటున్నారు. మరి, ఈ వార్తలో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.