బాధ లో సూర్య ఫ్యాన్స్..ఎందుకంటే

సూర్య హీరోగా నటించిన త‌మిళ చిత్రం సూర‌రాయి పోట్రు. సుధా కొంగ‌ర ద‌ర్శ‌క‌త్వం వహించిన ఈ మూవీ తెలుగులో ఆకాశ‌మే నీ హ‌ద్దురా పేరుతో రిలీజ్ అయి భారీ విజయం సాధించింది. ఏయిర్ డెక్క‌న్ ఫౌండ‌ర్ జి.ఆర్‌. గోపీనాథ్ జీవిత క‌థ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు.

ఇటీవల ఈ మూవీ ఆస్కార్ అవార్డ్ పోటీలో నామినేషన్ సాధించిన విషయం తెలిసిందే. మొత్తం 366 చిత్రాల‌ను నిర్వాహ‌కులు ఎంపిక చేయ‌గా.. అందులో మ‌న దేశం నుంచి సూరారై పొట్రు మాత్రమే నిలిచింది. తాజాగా ఈ చిత్రం ఆస్కార్‌ బరిలో నుంచి వైదొలిగింది. అకాడమీ స్క్రీనింగ్‌కు ఎంపిక అయిన సూరారై పోట్రు ఆ తర్వాతి రౌండ్స్‌కు నామినేట్ అవ్వలేకపోయింది. దీంతో మార్చి 15న ఆస్కార్‌ నుంచి అధికారికంగా తప్పకుంది. ఈ వార్త తెలిసి అభిమానులు నిరాశకు గురయ్యారు.