పదవి కన్నా పార్టీ ముఖ్యం : అద్వానీ

LK. Advaniనేడు బీజేపీ సీనియర్‌నేత, ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు ఎల్.కే. అద్వానీ 86వ జన్మదినం. బీజేపీ ప్రస్తుత అధ్యక్షుడు నితిన్ గడ్కరీ, పలువురు పార్టీ ప్రముఖులు అద్వానీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రధాని పదవిపై మీడియా వారు అడిగిన ఓ ప్రశ్నకు బదులుగా అద్వానీ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ తనకెంతో ఇచ్చిందనీ, పార్టీతో పోల్చుకుంటే ప్రధాని పదవి చాలా చిన్నదనీ, పార్టీకి తాను చేయాల్సింది ఇంకా చాలా మిగిలి ఉందని చెబుతూ ప్రధాన మంత్రి కావాలని తానెప్పుడూ అనుకోలేదని ఆ పదవి పై తనకు మోజు లేదని వ్యాఖ్యానించారు.