” షర్మిల కు ఆ అర్హత లేదు “

కాంగ్రెస్ పార్టీని విమర్శించే నైతిక అర్హత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల కు లేదని కేంద్రమంత్రి కోట్ల సూర్యప్రకాశ రెడ్డి అన్నారు. కిందటి నెల 18 వ తేదిన ప్రారంభమైన షర్మిల పాదయాత్ర గురువారం నాడు అనంతపూర్ జిల్లా నుంచి కర్నూల్ జిల్లాలోకి ప్రవేశిస్తున్న సందర్భంలో అదే జిల్లాకు చెందిన కోట్ల స్పందిస్తూ డబ్బులిచ్చి పాదయాత్రకు జనాన్ని తరలిస్తే అది ప్రజాభిమానం కాబోదని అన్నారు. రాయలసీమ జిల్లాల్లో జగన్ ను సమర్ధంగా ఎదుర్కునేందుకే కోట్ల కు మంత్రి పదవి ఇచ్చారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్న నేపధ్యంలో ఆయన షర్మిల పై ఈ విమర్శలు చేయటం గమనార్హం.