అసలైన సంక్రాంతి విన్నర్ ‘క్రాక్ ‘…

మాస్ మహరాజ్ రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని డైరక్షన్ లో తెరకెక్కిన సినిమా క్రాక్. కిక్ తో హిట్ అందుకున్న రవితేజ ఈసారి తన క్రాక్ ఏంటన్నది చూపించడానికి థియేటర్స్ లోకి వచ్చాడు.

ఆల్రెడీ గోపీచంద్ తో డాన్ శీను, బలుపు సినిమాలతో హిట్ అందుకోగా థర్డ్ మూవీతో హ్యాట్రిక్ కొట్టాలనే కసితో ఈ సినిమా చేసాడు. ఆ కసి కి శృతి హాసన్ గ్లామర్ , థమన్ మ్యూజిక్ , రామ్ లక్ష్మణ్ యాక్షన్ , గోపీచంద్ మలినేని డైరెక్షన్ తోడవడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ టాక్ తో కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. దీంతో సంక్రాంతి బరిలో అసలైన విన్నర్ గా క్రాక్ నిలిచింది.