సూపర్ స్టార్ మూవీలో మోనాల్ కు ఛాన్స్

‘సుడిగాడు’ చిత్రంతో ఇండస్ట్రీ కి హీరోయిన్ గా పరిచమైన మోనాల్ గజ్జర్..తెలుగు, తమిళం, మరాఠి, గుజరాతీ భాషల్లో పలు సినిమాలు చేసినప్పటికీ పెద్దగా పాపులర్ కాలేదు. కానీ ఈమె బిగ్ బాస్ షో తో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ఈ క్రేజ్ ఇప్పుడు ఈ భామకు వరుస ఛాన్సులు వచ్చేలా చేస్తున్నాయి. ఇప్పటికే ఈమె అల్లుడు అదుర్స్ మూవీ లో ఐటెం సాంగ్ చేసి ఆకట్టుకోగా..తాజాగా సూపర్ స్టార్ ఛాన్స్ వచ్చినట్లు తెలుస్తుంది.

మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట మూవీ లో మోనాల్ కు ఐటెం సాంగ్ ఛాన్స్ వచ్చినట్లు తెలుస్తుంది. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, 14రీల్స్ ప్లస్ పతాకాలపై పరశురామ్ దర్శకత్వంలో నవీన్, వై రవి శంకర్, సీవీ మోహన్, మహేష్ బాబు, రాము అచంట, గోపి అచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో మహేష్ సరసన మహానటి ఫేమ్ కీర్తి సురేష్ నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దుబాయ్‌లో జరుగుతుంది. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు తాజాగా ప్రకటించారు.