ఎన్టీఆర్ కన్ను కూడా అతడిపైనే పడిందా..?

కోలీవుడ్ నటుడు విజ‌య్‌సేతుప‌తి పేరు ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ లో మారుమోగిపోతుంది. రీసెంట్ గా ఉప్పెన మూవీ లో విలన్ గా విజయ్ తన నట విశ్వరూపం చూపించడం తో అందరు ప్రశంసలు కురిపిస్తున్నారు. అలాగే విజయ్ కోసం అగ్రహీరోలు , దర్శకులు పోటీపడుతున్నారట.

వీరిలో ఎన్టీఆర్ కూడా ఉన్నారట. ఎన్టీఆర్‌-త్రివిక్ర‌మ్ కాంబోలో ఓ మూవీ తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో విలన్ గా విజయ్ సేతుపతి ని ఎంపిక చేయాలనీ చూస్తున్నారట. డిఫ‌రెంట్ విల‌న్ గా విజ‌య్ సేతుప‌తి అయితే బాగుంటుంద‌ని, తార‌క్‌కు మంచి పోటీనిస్తాడ‌ని త్రివిక్ర‌మ్ భావిస్తున్న‌ట్టు టాక్‌. మరి విజయ్ ఈ ఆఫర్ కు ఓకే అంటే అభిమానులకు పెద్ద పండగే.