పుష్ప రిలీజ్ డేట్ ఫిక్స్

అల్లు అర్జున్ – సుకుమా కలయిక లో తెరకెక్కుతున్న పుష్ప చిత్రం యొక్క రిలీజ్ డేట్ ను మేకర్స్ ప్రకటించారు. స్వాతంత్య్ర దినోత్స‌వ శుభాకాంక్ష‌ల‌తో ఆగ‌స్ట్ 13న ఈ మూవీ విడుద‌ల కానుంద‌ని కొద్ది సేప‌టి క్రితం ప్ర‌క‌టించారు. గంధ‌పు చెక్క‌ల స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో బ‌న్నీ..పుష్ప‌రాజ్ పాత్ర‌లో క‌నిపించి సంద‌డి చేయ‌నున్నాడు. అలాగే మిగతా మెగా హీరోలు సైతం తమ కొత్త చిత్రాల తాలూకా రిలీజ్ డేట్స్ ప్రకటించి అభిమానులను సంబరాలకు గురి చేస్తున్నారు.

రామ్ చ‌ర‌ణ్ తాజా చిత్రం ఆర్ఆర్ఆర్ చిత్రం అక్టోబ‌ర్ 13న విడుద‌ల కానుంది. సాయిధ‌ర‌మ్ తేజ్ సోద‌రుడు వైష్ణ‌వ్ తేజ్ న‌టించిన తొలి చిత్రం ఉప్పెన ఫిబ్ర‌వ‌రి 12న విడుద‌ల కానుంది. క‌ళ్యాణ్ దేవ్ న‌టించిన సూప‌ర్ మ‌చ్చి కూడా త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు.