రవితేజ 68 మూవీ లో హీరోయిన్లు ఎవరో తెలుసా..?

క్రాక్ తో సూపర్ హిట్ అందుకున్న రవితేజ..ప్రస్తుతం రమేష్ వర్మ డైరెక్షన్లో ఖిలాడీ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ సెట్స్ ఫై ఉండగానే నేను లోకల్ ఫేమ్ త్రినాధ్ నక్కిన డైరెక్షన్లో ఫుల్లెన్త్ కామెడీ ఎంటర్టైనర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

ఈ సినిమాలో రవితేజ ఇద్దరు భామలతో ఆడిపాడనున్నాడట. ఈ సినిమాలో తమిళ భామ ఐశ్వర్యా మీనన్‌ ఓ కథానాయికగా ఎంపికైనట్టు సమాచారం. అలాగే మరో కథానాయికగా కన్నడ భామ శ్రీలీల నటించనున్నట్టు తెలిసింది. టి.జి.విశ్వప్రసాద్‌, అభిషేక్‌ అగర్వాల్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అలాగే ఈ సినిమాకు గాను రవితేజ ఏకంగా రూ.16 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు వినికిడి.