రోజ ‘జబర్దస్త్‌’ను వదిలేసినట్లేనా?

హీరోయిన్‌గా ఏ స్థాయిలో క్రేజ్‌ను రోజా దక్కించుకుందో అంతే స్థాయిలో జబర్దస్త్‌ కారణంగా దక్కించుకుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే రోజా జబర్దస్త్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నాగబాబుతో కలిసి గత ఏడు ఎనిమిది సంవత్సరాలుగా కూడా జబర్దస్త్‌కు ఆమె హోస్ట్‌గా వ్యవహరిస్తున్న విషయం తెల్సిందే. అయితే తాజాగా రాజకీయాలతో బిజీ అవుతున్న కారణంగా జబర్దస్త్‌కు ఫుల్‌ స్టాప్‌ పెట్టాలనే నిర్ణయానికి రోజా వచ్చినట్లుగా తెలుస్తోంది.

చాలా రోజులుగా ఈ వార్తలు వస్తున్నాయి. అయితే ఎట్టకేలకు రోజా ఔట్‌ అయినట్లుగా సమాచారం అందుతోంది. త్వరలో ప్రసారం కాబోతున్న ఎపిసోడ్‌కు చిత్రీకరణ జరుపుతున్న సమయంలో రోజా స్థానంలో శేఖర్‌ మాస్టర్‌ వచ్చాడు. దాంతో ఖచ్చితంగా రోజా పోయినట్లే అని, ఆమె మళ్లీ వచ్చేది కూడా అనుమానమే అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రోజాకు కీలకమైన పరిశ్రమల అభివృద్ది కమిటీ చైర్మన్‌ పదవిని కట్టబెట్టిన నేపథ్యంలో ఇలాంటి షోలు చేయడం కరెక్ట్‌ కాదని ఆమె భావించినట్లుగా తెలుస్తోంది. రోజా మళ్లీ ఎప్పుడు జబర్దస్త్‌లో కనిపించదేమో.