జులై 5న సాహ‌సం ?

gopichand-sahasamగోపీచంద్ క‌థానాయ‌కుడిగా న‌టించిన చిత్రం సాహ‌సం. తాప్సి క‌థానాయిక‌. చంద్రశేఖ‌ర్ యేలేటి ద‌ర్శక‌త్వం వ‌హించారు. ఈ చిత్రాన్ని జులై 5న విడుద‌ల చేయాల‌ని చిత్రబృందం భావిస్తోంది. ముందు ఈనెల 21న ఈ సినిమాని తీసుకొద్దామ‌నుకొన్నారు. కానీ అనివార్య కార‌ణాల వ‌ల్ల‌.. వామిదా ప‌డింది. జులై 5న విడుద‌ల చేయడం దాదాపు ఖాయ‌మే! ఒక‌వేళ ఈనెల 28న రానున్న ఓం, బ‌లుపు సినిమాలు వీర‌లెవిల్లో ఆడిస్తే గ‌నుక‌.. సాహసం విడుద‌ల చేసే సాహ‌సం నిర్మాత చేయ‌క‌పోవచ్చు. అప్పుడు మ‌రోసారి ఈ సినిమా వాయిదా ప‌డే అవ‌కాశాలున్నాయి. ఈ చిత్రానికి శ్రీ సంగీతం అందించారు.