2న ‘సాహ‌సం’ గీతాలు

sahasam first lookగోపీయంచ్ క‌థానాయ‌కుడిగా న‌టించిన చిత్రం సాహ‌సం. తాప్సి క‌థానాయిక‌. చంద్రశేఖర్ యేలేటి ద‌ర్శక‌త్వం వ‌హించారు. శ్రీ సంగీతం అందించారు. ఈ చిత్రంలోని గీతాల్ని జూన్ 2న విడుద‌ల చేస్తారు. నిర్మాత ఛ‌త్రప‌తి ప్రసాద్ మాట్లాడుతూ ”సినిమా చాలా బాగా వ‌చ్చింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడ‌క్షన్ కార్యక్రమాలు సాగుతున్నాయి. చంద్ర‌శేఖ‌ర్ ఓ డిఫ‌రెంట్ స‌బ్జెక్ట్‌ని ఎంచుకొన్నాడు. గోపీచంద్ చేసే సాహ‌సాలు అంద‌రినీ ఆక‌ట్టుకొంటాయి. ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ అంద‌రికీ న‌చ్చింది. సినిమా దానికి 100 రెట్లు బాగుంటుంది. శ్రీ అందించిన పాట‌లు, నేప‌థ్య సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆక‌ర్షణ‌” అని చెబుతున్నారు. జూన్ రెండో వారంలో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.