శింబుకి నయన పోయి లేఖ వచ్చె ……

లేఖా వాషింగ్టన్‌.. ఈ పేరెక్కడైనా విన్నట్టుందా?  లేదు కదా.. వేదం సినిమాలో మనోజ్‌ సరసన్‌ ఓ చిన్న పాత్రలో మెరిసిన ముద్దుగుమ్మ పేరది. ఇప్పుడీ భామ కోలీవుడ్‌ లో పాపులారిటీ సంపాదించేసుకుంది. అఫ్‌ కోర్స్‌ సినిమా హిట్టయి మాత్రం కాదు. తమిళ సినీ రంగంలో ప్లేబోయ్‌ గా పేరు తెచ్చుకున్న సింబూతో జతకట్టి. కేవలం సినిమాలోనే కాకుండా బయట కూడా ఈ జంట చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ కనిపిస్తున్నారట. చేతిలో పెద్దగా సినిమాలు లేని శింబు తనే దర్శకుడిగా మారి ” కేట్టవన్‌” అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు.  లేఖతో ఉన్న సంబంధం కారణంగానే ఆ సినిమాలో లేఖను హీరోయిన్‌ గా తీసుకున్నాడని అంతా చెప్పుకుంటున్నారు.  ఇంత కాలానికి నయనని మరిపించే అమ్మాయి శింబూకి దొరికిందని కామెంట్లు వినిపిస్తున్నాయి.