బన్నీ కి పెద్ద ఫ్యాన్ అంటున్న టైగర్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ను కేవలం అభిమానులు , సినీ ప్రేక్షకులే కాదు ఇతర ఇండస్ట్రీ లోని నటి నటులు సైతం ఇష్టపడుతుంటారు. ఇప్పటికే పలువురు తారలు బన్నీ డాన్స్ అన్న, యాక్టింగ్ అన్న ఎంతో ఇష్టమని తెలుపుగా..తాజాగా బాలీవుడ్ యాక్టర్ టైగర్ ష్రాఫ్ సైతం బన్నీ అంటే ఎంత ఇష్టమో తెలిపారు.

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ డాన్స్‌కి పెద్ద ఫ్యాన్ అట. అంతేకాకుండా బన్నీ సినిమాను రీమేక్ చేసి బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వడం కూడా తాను మర్చిపోలేని మధుర జ్ఞాపకం అని టైగర్ చెప్పుకొచ్చాడు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కించిన పరుగు సినిమాను హిందీలో హీరోపంటి పేరుతో రీమేక్ చేసిన విషయం తెలిసిందే. ఆ సినిమాతోనే టైగర్ హిందీలోకి అరంగేట్రం చేశాడు. ఆ సినిమాలోనే చేజింగ్‌లు, డాన్స్‌లతో టైగర్ అందరిని మెప్పించాడు.