కరణ్ కు జాకెట్ పంపిన విజయ్

రౌడీ హీరో విజయ్ దేవరకొండ …తనకు ఇష్టమైన వ్యక్తులకు గిఫ్ట్ లు పంపిస్తూ వారిని ఆనందపరుస్తుంటారు. రీసెంట్ గా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు దుస్తులు పంపించి ఆకట్టుకోగా..తాజాగా బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ కు గిఫ్ట్ పంపి వార్తల్లో నిలిచారు. కరణ్ కోసం ప్రత్యేకంగా డెనిమ్ జాకెట్ ఒకదాన్ని డిజైన్ చేయించి పంపించారు.

ఆ జాకెట్ కరణ్ జోహార్ మనసు దోచుకుంది. దాన్ని సోషల్ మీడియాలో అందరికీ చూపిస్తూ చాలా బాగుందని విజయ్ దేవరకొండకు కృతజ్ఞతలు చెప్పారు. ప్రస్తుతం వీరిద్దరి కానుకలో లైగర్ అనే సినిమా తెరకెక్కుతుంది. పూరి డైరెక్షన్లో రాబోతున్న ఈ మూవీ లో అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది.