కోహ్లి బర్త్ డే కి అభిమాని ఏ గిఫ్ట్ ఇచ్చాడో తెలుసా..?

kohli-bday-giftభారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ రేపు 28 వ పుట్టిన రోజు జరుపుకోబోతున్నాడు..ఈ సందర్బంగా బెంగుళూర్ చెందిన ఓ అభిమాని అదిరిపోయే గిఫ్ట్ డూడుల్‌ను తయారుచేసి సోషల్ మీడియా లో పోస్ట్ చేసాడు..

ఈ డూడుల్‌నులో కోహ్లీ ఇష్టపడే టాటూ, బ్యాట్, వికెట్, జెర్సీ, బీసీసీఐ లోగోలను ఉంచి విరాట్‌ను సూపర్‌మ్యాన్‌లా తయారుచేసాడు. కర్ణాటకలో కాసరగోడు ప్రాంతానికి చెందిన కరణ్ ఆచార్య ఈ డూడుల్‌ను తయారుచేయడం జరిగింది. గతం లో ఇతడు ఆంజనేయ స్వామి చిత్రంతో బాగా ఫేమస్ అయ్యాడు. కోహ్లీ అంటే ఎంత అభిమానమో చెప్పుకొచ్చాడు..‘కోహ్లి అటాకింగ్ బ్యాటింగ్ అంటే నాకెంతో ఇష్టం. అతడో డాషింగ్ బ్యాట్స్‌మెన్. అందుకే అతణ్ని సూపర్‌మ్యాన్‌లా చిత్రీకరించా’ అని కరణ్ చెప్పాడు. ఇప్పుడు డూడుల్‌ క్రికెట్ అభిమానులకు ఎంతగానో నచ్చుతుంది..దీనిని చూసిన ప్రతి అభిమాని షేర్ చేస్తూ కామెంట్స్ పెడుతున్నారు.