ఇప్పుడు తెలుగు లో ‘భీమ్‌’ యాప్..

beam-apదేశ వ్యాప్తంగా డిజిటల్‌ చెల్లింపులు జరగాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చాడు..ఈ నేపథ్యం లో ‘భీమ్‌(బీహెచ్‌ఐఎం- భారత్‌ ఇంటర్‌ఫేస్‌ ఫర్‌ మనీ)’ యాప్ ను ప్రవేశ పెట్టారు . ఇంతవరకు ఈ యాప్‌లో ఇంగ్లిష్‌, హిందీ భాషలు మాత్రమే ఉండగా, 1.2 వర్షన్‌లో కొత్తగా ఏడు భాషలను చేర్చారు. ఈ జాబితాలో తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, ఒడియా, గుజరాతీ, బెంగాలీ భాషలు ఉన్నాయి. తాజా వర్షన్‌ను గూగుల్‌ ప్లేస్టోర్‌లో అందుబాటులో ఉంచినట్లు భారత జాతీయ చెల్లింపుల సంస్థ(ఎన్‌పీసీఐ) బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది.

బ్యాంకు ఖాతాతో అనుసంధానమైన ఆధార్‌ సంఖ్యకు డబ్బు పంపేందుకు వీలు కల్పించే ‘పే టు ఆధార్‌ నంబర్‌’ అనే ఫీచర్‌ను యాప్‌లో చేర్చినట్లు తెలిపింది. డిజిటల్‌ లావాదేవీలు మరింత సురక్షితంగా జరిగేందుకు తోడ్పడేలా కొత్త వర్షన్‌లో భద్రతా ప్రమాణాలను మెరుగుపరిచినట్లు సంస్థ ప్రకటించింది.