తెలంగాణ 4జీ స్మార్ట్‌ ఫోన్స్..

celkon-telanganaఇప్పటివరకు మేడిన్ చైనా , మేడిన్ జపాన్ వంటి స్మార్ట్ ఫోన్స్ మాత్రమే చూసారు..తాజాగా మేడిన్ తెలంగాణ స్మార్ట్ ఫోన్స్ కూడా మార్కెట్లోకి వచ్చాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక హైదరాబాద్ మొబైల్ హబ్ గా పిలవబడుతున్న సంగతి తెల్సిందే..తాజాగా మన హైదరాబాద్ కు ఖ్యాతిని గడించింది. ఇప్పటివరకు ఫీచర్స్ ఫోన్లు మాత్రమే ఇక్కడ తయారవగా..తాజాగా హైదరాబాద్‌లోనే 4జీ స్మార్ట్‌ఫోన్లను రూపొందించినట్లు రాష్ర్టానికి చెందిన ప్రముఖ మొబైళ్ల తయారీ సంస్థ సెల్‌కాన్ ప్రకటించింది.

డైమండ్ యూ, డైమండ్ మెగా 4జీ స్మార్ట్‌ఫోన్లను మేడ్చల్ ప్లాంట్‌లోనే రూపొందించినట్లు కంపెనీ వెల్లడించింది. ఏడాదిన్నర క్రితం ఏర్పాటుచేసిన ఈ యూనిట్‌లో ఇప్పటివరకు 50 లక్షల మొబైళ్లు తయారైనట్లు చెప్పారు. డైమండ్ యూ ఫీచర్స్ విషయానికి వస్తే..

* 5 అంగుళాల టచ్‌స్క్రీన్
* 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్
* కార్టెక్స్ ఏ7 ప్రాసెసర్
* ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో
* 8జీబీ మెమొరీ(32జీబీ వరకు పెంచుకోవచ్చును)
*1జీబీ ర్యామ్, 8 మెగాపిక్సెల్ ఆటోఫోకస్ రియర్ కెమెరా
* 3.2 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
* 2,500 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్స్ ఉన్నాయి.
దీని ధరను రూ.5,999 గా సంస్థ ప్రకటించింది.

డైమండ్ మెగా 4జీ విషయానికి వస్తే..

* 5.5 అంగుళాల టచ్‌స్క్రీన్‌తోపాటు డైమండ్ యూలో ఉన్న అన్ని ఫీచర్స్‌తోపాటు వేలిముద్రల ద్వారా ఆపరేటింగ్ చేసుకోవచ్చును. దీని ధరను రూ. 6 ,400 గా సంస్థ నిర్ణయించింది.