జియో తరహాలోనే ఐడియా

Jio-SIM-Cards

టెలికం రంగం లో పెను సంచలనం సృష్టించిన జియో కు పోటీ గా ఐడియా కూడా తన సత్తా ను చాటుకోబోతుంది. జియో టీవీ, జియో మూవీస్‌, జియో మ్యూజిక్‌ తరహాలో ఐడియా కూడా అటువంటి యాప్స్‌ను తీసుకొచ్చేందుకు సిద్ధం అయ్యింది. ఈ నెల 31న ‘డిజిటల్‌ ఐడియా’ పేరిట యాప్స్‌ సూట్‌ను మార్కెట్లోకి తీసుకరాబోతుంది.

idea-4g

ఇందులో ఐడియా మూవీస్‌, టీవీ, మ్యూజిక్‌, గేమ్స్‌ యాప్స్‌ను ప్రారంభించేందుకు ముహూర్తం ఖరారుచేసింది. ఇటువంటి మీడియా స్ట్రీమింగ్‌, గేమింగ్‌ యాప్స్‌ ద్వారా డేటా వినియోగం పెరిగి తద్వారా మొబైల్‌ డేటా నుంచి వచ్చే ఆదాయం పెరుగుతుందని ఐడియా భావిస్తోంది. ప్రస్తుతం జియో మ్యాగ్స్‌, జియో ఎక్స్‌ప్రెస్‌ న్యూస్‌, జియో న్యూస్‌పేపర్స్‌ వంటి యాప్స్‌ను వినియోగదారులకు అందిస్తోంది.

ఐడియా ప్రస్తుతం టీవీ, మూవీస్‌, మ్యూజిక్‌, గేమింగ్‌ యాప్స్‌ను తీసుకొస్తోంది. ఈ మేరకు ఇప్పటికే ఆయా కంపెనీలతో సంస్థ ఒప్పందం చేసుకుంది.