ఎయిర్ టెల్ బాటలో ఐడియా

airtel

రిలయన్స్ జియో మార్కెట్లోకి రావడంతో తన కస్టమర్లను కాపాడుకొనేందుకుగాను మిగతా నెట్ వర్క్స్ కూడా తమ టారిప్ లో మార్పులు చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఎలాంటి రోమింగ్‌ ఛార్జీలూ చెల్లించాల్సిన అవసరం లేదని జియో ప్రకటించిన నేపథ్యంలో ఎయిర్‌టెల్‌ తన వినియోగదారులకు వూరట కలిగించే నిర్ణయం తీసుకుంది.

ఇప్పుడు ఐడియా కూడా ఎయిర్ తెల బాట అనుసరించింది. ఈ మేరకు రోమింగ్ లో ఉన్న సమయంలో ఇన్ కమింగ్ కాల్స్ కు చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని ఆ కంపెనీ ప్రకటించింది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుండి 20 కోట్ల మంది ఐడియా వినియోగదారులు ఇన్ కమింగ్ కాల్స్ ను రోమింగ్ లో ఉన్నప్పుడు ఉచితంగా పొందే అవకాశాన్ని, అలాగే 2జీ, 3జీ 4 జీ నెట్ వర్క్ లలో దేశంలో ఎక్కడి నుండైనా ఇకపై సాధారణ ఛార్జీలకే కాల్స్ చేసుకోవచ్చని ఒక ప్రకటనలో చెప్పింది ఐడియా