మార్కెట్లోకి లెనోవో కే 6 .. ఫీచర్స్ ఎలా ఉన్నాయో చూస్తారా..?

lenovo-k6-power

ప్రముఖ మొబైల్ సంస్థ లెనోవో..మొబైల్ మార్కెట్ లో దూసుకుపోతుంది. అతి తక్కువ ధరలకే కొత్త కొత్త ఫీచర్స్ అందిస్తుండడం తో ఎక్కువ మంది వినియోగదారులు లెనోవో మొబైల్స్ ఫై మక్కువ చూపిస్తున్నారు..ఈ నేపథ్యం లో వినియోగదారులకు సరికొత్త ఫీచర్స్ తన కొత్త ఫీచర్ ఫోన్ ను మార్కెట్లోకి తీసుకొచ్చింది లెనోవో సంస్థ. లెనోవో కే 6 పేరిట ఈ స్మార్ట్ మొబైల్ ను లాంచ్ చేసింది.

4 జీబీ ర్యామ్ వేరియంట్ తో ‘కే 6 పవర్’ పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్ ను అందుబాటులోకి తేనుంది. దీని ధరను రూ. రూ.10,999 గా కంపెనీ నిర్ణయించింది. జనవరి 31 నుంచి ఫ్లిప్కార్ట్ ద్వారా ఈ మొబైల్స్ అందుబాటులోకి రానున్నాయి.

దీని ప్రత్యేకతల ఫై ఓ లుక్ వేస్తే..

* 96.5 గంటల మ్యూజిక్
* 13.6 గంటల వీడియో
* 48 గంటల యిస్ కాల్స్
*12.6 నెట్ వాడకం
* 649 గంటల స్టాండ్ బై టైమ్ తో అల్టిమేట్ పవర్ మోడ్ వంటివి ప్రత్యేకతలు. ఈ సరికొత్త వేరియంట్ డార్క్ గ్రే, గోల్డ్, సిల్వర్ కలర్స్ లో విడుదల కానున్నాయి.

ఇక ఫీచర్స్ విషయానికి వస్తే ..

* 5 అంగుళాల ఫుల్ హెచ్ డీ స్క్రీన్
* 1.4 గిగాహెర్ట్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్
* 1080×1920 పిక్సెల్ రిజల్యూషన్
*–డాల్బే అట్మాస్ సౌండ్, ఫింగర్ ప్రింట్ స్కానర్
* 128 ఎక్స్ పాండబుల్ మెమొరీ
* 13 ఎంపీరియర్ కెమెరా
* 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా
* 4000ఎంఏహెచ్ బ్యాటరీ..