BSNL కి పూర్వవైభవం !


ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ రోజు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మంత్రి వర్గ నిర్ణయాలను కేంద్ర టెలికం శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ఢిల్లీలో మీడియాకు వెల్లడించారు. BSNL సంస్థకు బాసటగా నిలిచేందుకు ప్రభుత్వ రంగ టెలికాం సంస్థకు లక్షా 64 వేల కోట్ల రూపాయల ప్యాకేజ్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించగా, ఈ ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.

BSNL సేవలను మెరుగుపరచడం, బ్యాలెన్స్ షీట్‌ను తగ్గించడం, ఫైబర్ నెట్‌వర్క్ విస్తరణ వంటి మూడు అంశాలు ప్యాకేజీలో ఉన్నాయని కేంద్ర మంత్రి వివరించారు. బలమైన ప్రభుత్వ రంగ సంస్థ అవసరమని ఆయన పేర్కొన్నారు. 26 వేల 316 కోట్ల రూపాయలతో మారుమూల 24 వేల 680 గ్రామాల్లో.. 4G సేవలు అందించనున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. ప్రతి నెలా కొత్తగా లక్ష కనెక్షన్లు ఇస్తామని పేర్కొన్నారు.