మార్కెట్లోకి మోటోజీ 5ప్లస్‌..ఫీచర్స్ ఇదిగో..

Moto-G5-and-G5-Plus

ప్రముఖ మొబైల్ సంస్థ మోటో తాజాగా మోటో జీ5 ప్లస్‌ పేరిట సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. బుధవారం రాత్రి 11.59గంటల నుంచి ఈ కామర్స్‌ వెబ్‌సైట్‌ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది. గ్రే, బంగారు రంగుల్లో ప్రారంభ ఆఫర్లతో మోటో జీ5ప్లస్‌ విడుదల చేసినట్లు సంస్థ ప్రకటించింది. ప్రస్తుతం మార్కెట్లో జియోమీ రెడ్‌మీ నోట్‌4 రాణిస్తున్న సంగతి తెల్సిందే..దానికి పోటీగా మోటో జీ5 ప్లస్‌ ను విడుదల చేసినట్లు తెలుస్తుంది.

ఈ ఫోన్ ఆఫర్స్ విషయానికి వస్తే..ఎస్‌బీఐ డెబిట్‌ కార్డుతో కొనుగోలుకు మరో 10 శాతం అదనపు డిస్కౌంట్‌ ఇస్తున్నట్లు పేర్కొంది. ఎటువంటి రుసుములు లేకుండా ఈఎంఐ వెసులుబాటు కల్పించనుంది. ఫోన్‌తోపాటు రూ.1299 విలువ కలిగిన మోటో జీ2 ప్లస్‌ హెడ్‌సెట్‌ కేవలం రూ.599లకే ఇస్తుంది. మోటో జీ5ప్లస్‌ రెండు వేరియంట్స్‌లో అందుబాటులోకి తీసుకొచ్చారు.

దీని ఫీచర్స్ విషయానికి వస్తే..

Moto-G5-and-G5-Plus2

* 4జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్‌ కలిగిన జీ5ప్లస్‌ ధర రూ.16,999
* ఆండ్రాయిడ్‌ 7.0 నౌగట్‌
* 5.2 అంగుళాల హెచ్‌డీ తెర
* ఎల్‌సీడీ డిస్‌ప్లే గొరిల్లా ప్రొటెక్షన్‌
* 2గిగా హెర్జ్‌ స్నాప్‌డ్రాగన్‌ 625 ఆక్టాకోర్‌
* పూర్తి మెటల్‌ బాడీ
* 3000 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం
* రూ.14,999 ప్రారంభ ధరతో 3జీబీ ర్యామ్‌, 16జీబీ స్టోరేజ్‌.