వాట్సాప్‌ నుండి అదిరిపోయే ఫీచర్

sthats

వాట్సాప్‌లో మరో అదిరిపోయే ఫీచర్‌ రానుంది. రియ‌ల్ టైమ్‌లో మీ ఫ్రెండ్స్‌ ఎక్క‌డ ఉన్నారో చెప్పే ఆ ఫీచ‌ర్‌ను రూపొందిచేందుకు వాట్సప్ కృషి చేస్తోంద‌ని ట్విట్ట‌ర్‌లోని వాబీటా ఇన్ఫో పేర్కొంది. ఈ స‌రికొత్త ఫీచ‌ర్ ఐవోఎస్ బీటా వ‌ర్షన్ 2.17.3.28, ఆండ్రాయిడ్ 2.16.399, ఆపై వెర్షన్ల‌లో అందుబాటులో ఉంటుంద‌ని తెలిపింది.

ఐవోఎస్‌, ఆండ్రాయిడ్‌ వినియోగదారులకు అందుబాటులోకి రానున్న ఈ ఫీచర్.. ప్రసుతం పరీక్షల దశలో వుంది. దీనికి సంబంధించిన వీడియోలో ప్రస్తుతం నెట్‌లో చక్కర్లు కొడుతున్నాయి. వాటి ప్రకారం.. వాట్సాప్‌ గ్రూపులో లైవ్‌ లొకేషన్‌ సదుపాయం ద్వారా మీరెక్కడున్నారో మీ స్నేహితులు తెలుసుకునే వీలుంటుంది. ఒక స్థలానికి కొందరు చేరుకుని మరికొందరు దారి తెలీక ఇబ్బంది పడుతున్న సందర్భంలో ఆ స్నేహితుడు ఎక్కడున్నాడో తెలుసుకునేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది.