ఇక నుండి జియో నుండి నో ప్రీ కాల్స్ …

ఫ్రీ కాల్స్ , ఫ్రీ నెట్, ఫ్రీ మెసేజెస్ ఇలా అన్ని ఫ్రీ ఫ్రీ అంటూ అతి తక్కువ టైంలోనే కోట్ల మంది ఖాతాదారులను చేసుకున్న జియో..ఇప్పుడు నో ఫ్రీ అంటుంది. అక్టోబర్ 10 తర్వాత మీరు ఎప్పుడు రీచార్జ్ చేస్తే అప్పటి నుంచి మీకు అవుట్ గోయింగ్ కాల్స్ పై చార్జీలు పడనున్నాయి. కాకపోతే అన్ని అవుట్ గోయింగ్ కాల్స్ చార్జీలు పడవు. జియో నుంచి జియో కు కాల్ చేస్తే ఫ్రీ. అదే జియో నుంచి వేరే నెట్ వర్క్ కు కాల్ చేసినప్పుడు మాత్రమే చార్జీలు పడతాయి. అది కూడా ఎంతో ఎక్కువ కాదులెండి.. కేవలం నిమిషానికి ఆరు పైసలను మాత్రమే చార్జీగా పడనుంది.

కానీ సడెన్ గా ఛార్జ్ లు వేయడం ఏంటి అంటే..ఏ మొబైల్ నెట్ వర్క్ నుంచి అయినా మరో మొబైల్ నెట్ వర్క్ కు కాల్ చేసినప్పుడు కాల్ చేసిన నెట్ వర్క్ కు సంబంధించిన సర్వీస్ ప్రొవైడర్, కాల్ అందుకున్న సర్వీస్ ప్రొవైడర్ కు కొంత రుసుము చెల్లించాలి. దీన్నే ఐయూసీ అంటారు. జియో నుంచి కాల్స్ ఉచితం కావడంతో జియో నుంచే ఇతర సర్వీస్ ప్రొవైడర్లకు కాల్స్ ఎక్కువగా వెళుతూ ఉంటాయి. కాబట్టి ఈ ఐయూసీ భారం జియో పైనే పడుతుంది. ఇప్పటివరకు ఆ భారం అంత జియో నే మోసింది. కానీ ఎంతకాలం ఇలా అని ఇకపై వినియోగదారులపైనే ఆ భారం వేసేందుకు సిద్దమయ్యింది.