నోకియా 105 (2019) ఫీచర్ ఫోన్‌ ఫీచర్లు చూస్తారా..?

ప్రముఖ మొబైల్స్ తయారీదారు హెచ్‌ఎండీ గ్లోబల్ నోకియా..తాజాగా భారత మార్కెట్లోకి 105 (2019) ఫీచర్ ఫోన్‌ను విడుదల చేసింది. బ్లూ, పింక్, బ్లాక్ కలర్ ఆప్షన్లలో మార్కెట్లోకి వచ్చిన ఈ ఫోన్ ధర కేవలం రూ.1199 మాత్రమే.

ఇక ఈ ఫోన్ ఫీచర్లు చూస్తే..

* 1.77 ఇంచుల కలర్ డిస్‌ప్లే
* 2వేల వరకు కాంటాక్టులు
* 500 ఎస్‌ఎంఎస్‌ల వరకు ఈ ఫోన్‌లో స్టోర్ చేసుకోవచ్చు.
* అలాగే ఎఫ్‌ఎం రేడియో, ఎల్‌ఈడీ టార్చి లైట్
* ప్రీ లోడెడ్ గేమ్స్, 4ఎంబీ ర్యామ్
* 4ఎంబీ స్టోరేజ్, డ్యుయల్ సిమ్
* 800 ఎంఏహెచ్ బ్యాటరీ 18.2 రోజుల వరకు స్టాండ్‌బై టైం తదితర ఫీచర్లు ఉన్నాయి.