మళ్లీ పెరగబోతున్న ఫోన్ ఛార్జ్ లు..

మొన్నటి వరకు అంత ఫ్రీ అంటూ వినియోగదారులను ఆకట్టుకున్న మొబైల్ సంస్థలు..ఇప్పుడు ఛార్జ్ ల మోత మోగిస్తే వామ్మో అనుకునేలా చేస్తున్నారు. ఇప్పటికే టారిఫ్ లు పెంచి ఛార్జ్ లు పెంచిన సంస్థలు.. మరోసారి చార్జీల మోతకు సిద్దమైనట్లు సమాచారం. మొన్నటికిమొన్న దాదాపు 16 నుంచి 35 శాతం వరకు చార్జీలు పెంచాయి.

డేటా ప్యాక్స్ లో ఎలాంటి మార్పులు చేయనప్పటికీ… మినిమం రీచార్జ్ ఎమౌంట్స్ పెంచడంతో పాటు, ఓవరాల్ గా అన్ని ప్యాక్స్ రేట్లు పెంచాయి మొబైల్ సంస్థలు. ఇప్పుడు అవే చార్జీల్ని మరో 30శాతం పెంచేందుకు రంగం సిద్ధం చేస్తున్నాయి. ఈసారి కంపెనీలన్నీ ఏజీఆర్ పేరుతో ఛార్జ్ లు పెంచబోతున్నట్లు సమాచారం. ఈ వార్త వినియోగదారులకు పిడుగు లాంటిదే అయినప్పటికీ తప్పదు మరి.