ఈ ఫోన్ మోడల్ ఏంటో కానీ ఫీచర్లు మాత్రం అదిరిపోయాయి..

స్మార్ట్ యుగంలో స్మార్ట్ ఫోన్ల హావ నడుస్తుంది..మార్కెట్లోకి వివిధ రకాల కంపెనీ ల ఫోన్లు వస్తూ హల్చల్ చేస్తున్నాయి. ఇప్పటికే పలు ఫోన్లు రాగా..చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ హ్యాండ్‌సెట్స్ కంపెనీ రియల్‌మి మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లోకి తీసుకరాబోతుంది. ఈ ఫోన్ పేరు తెలియదు కానీ ఇందులో మాత్రం 64 ఎంపీ కెమెరా ఉందని తెలుస్తుంది. అలాగే ఈ ఫోన్‌తో తీసిన ఫోటోలను ట్వీట్ చేసింది. ఇవి కాస్తా వైరల్ అయ్యాయి. ఈ ఫోన్ దీపావళి కల్లా మార్కెట్‌లోకి రావొచ్చు. కంపెనీ ఈ ఫోన్‌లో శాంసంగ్ ఐసోసెల్ బ్రైట్ జీడబ్ల్యూ1 సెన్సర్‌ను ఉపయోగించినట్లు సమాచారం.

* ఈ ఫోన్ లో క్వాడ్ కెమెరాలు (నాలుగు కెమెరాలు) ఉండనున్నాయి. లీకైన ఫోటోను గమనిస్తే ఈ విషయం తెలుస్తుంది. ప్రస్తుతమైతే ఈ ఫోన్ కు సంబందించిన విషయాలు బయటకు రాలేదు. కానీ ఈ ఫోన్ మాత్రం కస్టమర్లను విపరీతంగా ఆకట్టుకోవడం ఖాయమని సంస్థ చెపుతుంది.