హోలీ ఆఫర్ ప్రకటించిన రిలయన్స్‌..

holi-offer

ప్రస్తుతం టెలికం సంస్థలు తమ వినియోగదారులను కాపాడుకునేందుకు నానా కష్టాలు పడుతున్నారు. ముఖ్యం గా ప్రవైట్ టెలికం సంస్థలలో రోజు రోజుకి ఈ పోటీ తత్త్వం మరింతగా పెరుగుతుంది. తాజాగా రిలయన్స్‌ హోలీ ఆఫర్ ప్రకటించి మిగతా సంస్థలకు షాక్ ఇచ్చింది.

relaince-holi-offer
హోలీ సందర్భాంగా రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌(ఆర్‌కామ్‌) నూతన ఆఫర్లతో ముందుకొచ్చింది. ఇందులో భాగంగా రూ.49కే 1జీబీ డేటా, రూ.149కే 3జీబీ డేటాతో పాటు నెట్‌వర్క్‌ పరిధిలో ఉచితంగా అపరిమిత లోకల్‌, ఎస్‌టీడీ కాల్స్‌ చేసుకునే అవకాశం కల్పించింది. హోలీ పండగ సందర్భంగా 28రోజుల పాటు చెల్లుబాటు అయ్యేలా కొత్త ప్లాన్‌లను తీసుకొచ్చింది.ఆర్‌కామ్‌ 3జీ, 2జీ వినియోగదారులను దృష్టిలో ఉంచుకొని వివిధ ప్లాన్‌లను కూడా ప్రకటించింది. రూ.99కే అపరిమిత 3జీ డేటా, రూ.49కే అపరిమిత 2జీ డేటాను వాడుకునేందుకు ప్రత్యేక ఆఫర్లను వెల్లడించింది.