ఈ టైపు రోబోట్ ని మీరు చూస్తే..ఇంట్లో పెట్టుకోవలనిపిస్తుంది..

naoరోబోస్ అంటే తెలియని వారు ఉండరు, ఇప్పుడు మీరు చూస్తున్న రోబో నెక్స్ట్ జనరేషన్ రోబో , చూడటానికి ఎంతో కలర్ ఫుల్ గా ఉన్న ఈ స్మార్ట్ రోబో పేరు – నో . రోబో సినిమా లో చిట్టి చిట్టి రోబో సాంగ్ ని గుర్తుకు తెచ్చేల ఈ నో రోబో ఉంటుంది ఈ స్మార్ట్ న్యూ టెక్నాలజీ రోబో.

నెక్స్ట్ జనరేషన్ రోబో గా మార్కెట్ లోకి దూసుకవస్తుంది. ఈ న్యూ రోబో – దీని హైట్ జస్ట్ 23 ఇన్చేస్ అంటే 58 సెం.మీ అన్నమాట. స్మూత్ వాక్ కోసం కాళ్ళకి బంపెర్స్ , పేస్ పార్ట్ లో 2 సీక్రెట్ కామెరాస్ తో బ్యూటీ ఫుల్ కలర్ కాంబినేషన్ తో డిజైన్ చేసారు. అలాగే కమ్యూనికేషన్ జరగటానికి ఇన్ఫ్రారెడ్ , వైఫి, వాయిస్ ని అందించారు. యునిక్ స్టైల్ లో డిజైన్ చేసిన ఈ స్మార్ట్ నెక్స్ట్ జనరేషన్ రోబో, వీడియోస్ గేమ్స్ ఆడుతుంది, ఫుడ్ బాల్ గేమ్స్ , డాన్స్ , ఎక్స్ సైజు కూడా చేస్తుంది .

డాన్సు అంటే ఆషామాషీ డాన్సు కాదు ఎంతో ఫేమస్ అయ్యిన గంగం డాన్స్ కి కూడా చెయ్యగలదు ఈ స్మార్ట్ రోబో . క్లియర్ గా చెప్పాలంటే – ఇందులో 4 మైక్రో ఫోన్స్ , 2 లౌడ్ స్పీకర్స్ , సోనార్ సేన్సోర్స్ , ఆన్ బోర్డు కంప్యూటర్ ఫుల్ ప్రోగ్రమబ్లె , ఫోర్సు సెన్సిటివ్ ఉన్నాయి.