గెలాక్సీ ఎస్‌10 లైట్‌ ఫీచర్లు చూసారా..?

ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం శాంసంగ్‌ తన గెలాక్సీ ఎస్‌10 లైట్‌ 512జీబీ వేరియంట్‌ను శుక్రవారం విడుదల చేసి ఆకట్టుకుంది. వెనుకవైపు ట్రిపుల్‌ కెమెరాలు (48 మెగాపిక్సెల్‌ స్టడీ ఓఐఎస్, 12ఎంపీ అల్ట్రా–వైడ్, 5ఎంపీ మాక్రో సెన్సాన్స్‌) ఉండగా, సెల్ఫీల కోసం 32 ఎంపీ కెమెరాను అమర్చడం విశేషం. ఇక ఫోన్ ధర రూ. 44,999 కాగా, పాత వేరియంట్‌తో మార్పిడి ద్వారా రూ. 5000 వరకు బోనస్‌ ఇస్తున్నట్లు కంపెనీ తెలిపింది. మార్చి 1 నుంచి ఈ స్మార్ట్ ఫోన్ విక్రయాలు మొదలుకానున్నాయి.

గెలాక్సీ ఎస్‌10 లైట్‌ ఫీచర్లు చూస్తే..

6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ సూపర్‌ అమోలెడ్‌ ప్లస్‌ ఇన్ఫినిటీ–ఓ డిస్‌ప్లే
1080x 2,400 పిక్సెల్స్ రిజల్యూషన్‌
క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 855 ఆక్టా–కోర్‌ సాక్‌
ఆండ్రాయిడ్‌ 10
8జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజ్‌
4500ఎంఏహెచ్ బ్యాటరీ