వినియోగదారులకు శాంసంగ్‌ రిపబ్లిక్‌ డే ఆఫర్లు..

ప్రముఖ ఎలక్ట్రానిక్స్‌ తయారీదారు సంస్థ శాంసంగ్‌ రిపబ్లిక్‌ సందర్భంగా వినియోగదారులకు ఆకట్టుకునే ఆఫర్లను ప్రకటించింది. టీవీలు, ఫోన్లు, మైక్రోవేవ్‌ ఓవెన్‌లు, వాషింగ్‌ మెషిన్‌లు మొదలగు ఉత్పత్తులపై భారీ ఆఫర్లు ప్రకటించింది.

క్యూలెడ్‌ లేదా 4కె అల్ట్రా హెచ్‌డీ టీవీలను కస్టమర్లు కొనుగోలు చేస్తే గెలాక్సీ ఎస్‌10 స్మార్ట్‌ఫోన్‌కు చెందిన 512జీబీ వేరియెంట్‌ను ఉచితంగా అందిస్తుంది. అలాగే శాంసంగ్‌ టీవీలను కొనుగోలు చేస్తే ఆ టీవీల రేట్లను బట్టి గెలాక్సీ ఫోన్లను ఫ్రీ గా అందిస్తుంది. ఇక యాక్సిస్‌ బ్యాంక్‌, ఫెడరల్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ డెబిట్‌, క్రెడిట్‌ కార్డులతో ఆయా వస్తువులను కొనుగోలు చేస్తే 15 శాతం వరకు క్యాష్‌బ్యాక్‌ పొందవచ్చు.