కొత్త ప్రైవసీ పాలసీ పై వాట్స‌ప్ క్లారిటీ

కొద్ది రోజులకు ముందు వాట్స‌ప్ ప్రవేశపెట్టిన కొత్త ప్రైవసీ పాలసీ ని యూజర్లు యాక్సెప్ట్ చేయకపోతే వాట్స‌ప్ ఆగిపోతుందని సోషల్ మీడియా లో ప్రచారం జరుగుతుంది. దీనిపై వాట్స‌ప్ క్లారిటీ ఇచ్చింది. వాట్స‌ప్ ప్రవేశపెట్టిన కొత్త ప్రైవసీ పాలసీని ఇంకా ఆమోదించని యూజర్ల అకౌంట్లు కూడా ఎప్పటిలాగే పనిచేస్తాయని ఆసంస్థ‌ తెలిపింది. అయితే యూజర్లకు ప్రైవసీ పాలసీ గురించి క్రమం తప్పకుండా గుర్తుచేస్తుంటామని పేర్కొంది. పర్సనల్‌ డేటా ప్రొటెక్షన్‌ చట్టం అమల్లోకి వచ్చేంతవరకు వాట్సాప్‌ అకౌంట్లు, ఫీచర్లలో ఎలాంటి మార్పు ఉండబోదని పేర్కొంది. యూజర్ల వ్యక్తిగత సమాచార భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపింది.