వాట్సప్‌లో కొత్త ఫీచర్‌, ఇక ఇబ్బంది లేదు

ప్రపంచ వ్యాప్తంగా వాట్సప్‌ వినియోగదారుల సంఖ్య అమాంతం పెరిగి పోయింది. దాదాపు 200 కోట్ల మంది వినియోగదారులను వాట్సప్‌ సొంతం చేసుకుంది. వాట్సన్‌ను వినియోగించే వారికి ఎప్పటికప్పుడు కొత్త అనుభూతిని కలిగిస్తూ వస్తోంది. గతంలో కేవలం మెసేజ్‌లు మరియు ఫొటోలు మాత్రమే పంపించుకునేందుకు వీలుగా ఉన్న వాట్సప్‌ ఇప్పుడు ఎన్నో సదుపాయలను ఇచ్చింది. వాయిస్‌ కాలింగ్‌, వీడియో కాలింగ్‌లతో పాటు డబ్బులు ట్రాన్సపర్‌ చేసుకునే ఫెసిలిటీని కూడా కల్పించింది. వాయిస్‌ మెసేజ్‌లను వాట్సప్‌ ద్వారా పంపించడం జరుగుతుంది. అయితే ఒకసారి సౌండ్‌ రికార్డ్‌ చేసిన తర్వాత దాన్ని సరి చూసుకునే అవకాశం లేదు.

సరి చూసుకోకుండా డైరెక్ట్‌గా పంపించడం జరుగుతుంది. అలా జరుగుతున్నప్పుడు కొన్ని సార్లు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అందుకే ఒకసారి వాయిస్‌ రికార్డ్‌ చేసుకున్న తర్వాత దాన్ని విని ఓకే అనుకుంటే పంపించే ఆప్షన్‌ను తీసుకు వచ్చారు. ప్రస్తుతం బీటా వర్షన్‌లో ఈ ఆప్షన్‌ వచ్చింది. రెండు వారాల్లో రెగ్యులర్‌ వినియోగదారులకు రాబోతుంది. మొత్తానికి వాట్సప్‌ నుండి వస్తున్న ఫీచర్స్‌తో ప్రపంచంలోనే మరింత ప్రముఖంగా వాట్సప్‌ నిలదొక్కుకుంటుంది. ప్రస్తుతం మొత్తం కూడా వాట్సప్‌ ను వినియోగిస్తున్నారు.