వాట్సాప్ లో పేమెంట్స్‌ ఫీచర్‌..

ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను తీసుకొచ్చే వాట్సాప్ ..తాజాగా పేమెంట్స్‌ ఫీచర్‌ ను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే ఈ ఫీచర్‌ను వాట్సాప్‌ పలువురు ఎంపిక చేసిన యూజర్లకు అందిస్తూ ఈ ఫీచర్‌ను ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నది. ఈ క్రమంలోనే త్వరలో వాట్సాప్‌ పే ఫీచర్‌ దేశంలోని వాట్సాప్‌ వినియోగదారులందరికీ అందుబాటులోకి రానుంది.

ఈ మేరకు వాట్సాప్‌.. నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) నుంచి విడతల వారీగా పేమెంట్స్‌ సేవలకు గాను లైసెన్స్‌లు పొందింది. దీంతో త్వరలోనే వాట్సాప్‌ పే సేవలు దేశంలోని 40 కోట్ల వాట్సాప్‌ యూజర్లకు అందుబాటులోకి రానున్నాయి. ఇక ఈ సేవలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే వాట్సాప్‌ పే దేశంలోనే అతి పెద్ద డిజిటల్‌ చెల్లింపు సంస్థగా మారుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.