మళ్లీ పాత వాట్సాప్ స్టేటస్..

whatsap-msg

ఇప్పుడు ఎక్కడ చూసిన జనాలంతా వాట్సాప్ తోనే టైం గడుపుతున్నారు. చిన్న , పెద్ద , సమయం , సందర్భం కూడా అనే తేడ కూడా లేకుండా ఉదయం లేచిన దగ్గరి నుండి పడుకునే వరకు అందరూ వాట్సాప్ లోనే గడిపిస్తుండడం తో ఈ మధ్య వాట్సాప్ సరికొత్త స్టేటస్ ఫీచర్ ను ప్రవేశ పెట్టిన సంగతి తెల్సిందే. అయితే ఆ ఫీచర్ విజయవంతం కాకపోయేసరికి మళ్లీ పాత టెక్స్ట్ బేస్‌డ్ ఫీచర్‌ ను మారుస్తున్నట్లు వాట్సాప్ ప్రకటించింది.

whatsapp-beta-status-update
ఇంతకు ముందు స్టేటస్‌లో ఫొటోతో పాటు ఓ చిన్న టెక్ట్ రాసుకోవడానికి వీలుండేది. అయితే దాని ప్లేస్ లో ఫొటోతో పాటు చిన్నపాటి వీడియో కూడా స్టేటస్‌లో పెట్టుకునేలా సరికొత్త ఫీచర్‌ని ప్రవేశ పెట్టారు. కానీ యూజర్లు పెట్టిన స్టేటస్‌ మెసేజ్‌లు 24 గంటల తర్వాత ఆటోమేటిక్‌గా మాయవుతుండడంతో, కొత్త ఫీచర్ బాగోలేదనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమయ్యాయి. ఫీడ్‌బ్యాక్‌ను పరిశీలించిన వాట్సాప్.. వెంటనే పాత ఫీచర్ నే మళ్లీ అప్‌డేట్ చేయనున్నట్లు ప్రకటించింది.