64 ఎంపీ కెమెరా ఫీచర్‌తో రెడ్‌మి ఫోన్..

ఇప్పటికే మార్కెట్లోకి రకరకాల మోడల్స్ ను తీసుకొచ్చిన షావోమి..తాజాగా మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సిద్దమవుతుంది. 64 ఎంపీ కెమెరా ఫీచర్‌తో ఈ ఫోన్ ను లాంచ్ చేయబోతున్నట్లు సమాచారం. రెడ్‌మి జనరల్ మేనేజర్ లు వీబింగ్ 64 ఎంపీ కెమెరా ఫోన్‌పై పనిచేస్తున్నామనే విషయాన్ని ధ్రువీకరించారు.

ఈ ఫోన్ ప్రత్యేకతలు..

* వెనుక భాగంలో ఏకంగా నాలుగు కెమెరాలు
* ఒక కెమెరా 64 ఎంపీ
* మిగతా మూడు కెమెరాల్లో ఎలాంటి సెన్సర్లు ఉంటాయో చూడాలి.

కేవలం రెడ్‌మి మాత్రమే కాకుండా 64 ఎంపీ కెమెరాపై ఇతర మొబైల్ హ్యాండ్‌సెట్స్ తయారీ కంపెనీలు కూడా పనిచేస్తున్నాయి. శాంసంగ్, రియల్‌మి వంటి కంపెనీలు పోటీలో ఉన్నాయి.