తీపి కబురు : ఏపీ డీఎస్సీ పరీక్ష షెడ్యూల్ విడుదల..

ఎప్పటి నుండో ఎదురుచూస్తున్న డీఎస్సీ పరీక్ష షెడ్యూల్ మొత్తానికి విడుదల చేసింది ఏపీ విద్యాశాఖా. శుక్రవారం (అక్టోబరు 5) సచివాలయంలో మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ షెడ్యూల్ ను విడుదల చేసారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..రాష్ట్రంలోని సంక్షేమ శాఖలు, పురపాలిక, జడ్పీ, ఎంపీపీ పాఠశాలల్లో కలిపి మొత్తం 9,275 పోస్టులకు పరీక్ష నిర్వహించనున్నట్లు, డీఎస్సీ ద్వారానే ఈ ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేపట్టనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు.

డీఎస్సీ పరీక్షను ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహించనున్నట్లు , ఈ పరీక్షకు ఎస్జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులకు కూడా అవకాశం కల్పిస్తున్నట్లు, ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేస్తున్నట్లు తెలిపారు.

షెడ్యూల్‌ విషయానికి వస్తే..

ఆర్టీ, టెట్ నోటిషికేషన్ అక్టోబర్ 10, 2018
దరఖాస్తు రుసుము చెల్లింపు అక్టోబర్ 10, 2018 – నవంబర్ 02 , 2018
దరఖాస్తు సమర్పణకు తుది గడువు నవంబర్ 3, 2018
హాల్‌టిక్కెట్ల డౌన్‌లోడ్‌ నవంబర్ 20, 2018 నుంచి
పరీక్ష నిర్వహణ నవంబర్ 30, 2018 – డిసెంబర్ 14, 2018
ప్రాథమిక ‘కీ’ విడుదల డిసెంబర్ 16, 2018
అభ్యంతరాల స్వీకరణ డిసెంబర్ 16 – 23, 2018 వరకు
తుది ‘కీ’ విడుదల డిసెంబర్ 27, 2018
ఫలితాలు జనవరి 03, 2019 .