తిరుమల మహా సంప్రోక్షణ ఫై చంద్రబాబు కీలక తీర్పు…

కలియుగ దేవుడు శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం లో 12 సంవత్సరాల తరువాత చేయబోతున్న మహాసంప్రోక్షణ సందర్భంగా ఆగస్టు 11 నుంచి 16 వరకు శ్రీవారి దర్శనాన్ని నిలిపివేయాలని టీటీడీ పాలకమండలి నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనిపై అంతటా వ్యతిరేకత మొదలయ్యింది. గతం లో ఎన్నడూ లేని విధంగా భక్తులకు దర్శనం రద్దు చేయడమేంటి, ఇది ఏదో కుట్ర పూరిత పనే అనే విమర్శలు తలెత్తడం తో ఈ విషయం ఫై ఏపీ సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు.

మహా సంప్రోక్షణ రోజుల్లో పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతించాలని అధికారులను ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఆదేశించారు. ఆగమ శాస్త్రానుసారం పూజా కార్యక్రమాలు నిర్వహించాలని, పూజలకు ఇబ్బంది లేకుండా చూడాలని స్పష్టం చేశారు. గతంలో మహా సంప్రోక్షణ రోజుల్లో పాటించిన నిబంధనలను అనుసరిస్తూనే పరిమిత సంఖ్యలో భక్తులకు దర్శనం చేసుకునే అవకాశం కల్పించాలని అన్నారు. దర్శనానికి రోజుల తరబడి భక్తులు ఎదురుచూసేలా చేయరాదని అన్నారు.