స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మెగా పవర్ స్టార్..

దేశ వ్యాప్తంగా 72 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.. చిన్న పెద్ద అందరు కూడా ఈ వేడుకల్లో పాల్గొంటూ మన దేశానికి ఎలా స్వాతంత్రం వచ్చిందనేది గుర్తు చేసుకుంటున్నారు. ఇక ఈ వేడుకల్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పాల్గొని సందడి చేసాడు. కొండాపూర్ లోని బొటానికల్ గార్డెన్ రోడ్ లో ఉన్న చిరాక్ ఇంటర్నేషనల్ స్కూల్ లో జరిగిన ఈ వేడుకలకు రామ్ చరణ్ ముఖ్య అతిధిగా హాజరయ్యాడు.

దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన వీరులను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. స్వాతంత్ర సమరయోధుల జీవిత చరిత్రలను ప్రతి ఒక్కరు తప్పక తెలుసుకోవాలని, వారు చూపించిన బాటలో నడవాలని ఈ సందర్భంగా రామ్ చరణ్ పిల్లలకు తెలియజేశాడు. ప్రస్తుతం రామ్ చరణ్ , బోయపాటి శ్రీను డైరెక్షన్లో ఓ యాక్షన్ మూవీ చేస్తున్నాడు. అలాగే చిరంజీవి చేస్తున్న సైరా చిత్రానికి నిర్మాత గా వ్యవహరిస్తున్నాడు.