మేడారం బస్ టికెట్ ధరలు ఇలా ఉన్నాయి…

భారత దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతర గా చెప్పబడే మేడారం జాతర ఈ ఏడాది జరగబోతుంది. ప్రతీ రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ జాతర మాఘ శుద్ధ పౌర్ణమి రోజున మొదలై నాలుగు రోజుల పాటు జరుగుతుంది. కాగా ఈ ఏడాది మేడారం జాతరకు వెళ్లాలనుకొనే భక్తులకు ఆర్టీసీ పెద్ద షాక్ ఇచ్చింది. మేడారంకు వెళ్లే బస్సు ల టికెట్ ధరలను భారీగా పెంచింది.

గతేడాది ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించాక, టికెట్ ధరలు పెంచుతూ సీఎం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో మేడారం జాతర టికెట్ల రేట్లు కూడా పెరిగాయి. మేడారం గ్రామం వరంగల్ జిల్లా కేంద్రానికి 110 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. ఈసారి జాతరకు మొత్తం 4 వేల బస్సులు నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఇందులో ముఖ్యంగా వరంగల్ రీజియన్ నుంచి అత్యధికంగా 2,250, కరీంనగర్ రీజియన్ నుంచి 600 బస్సులు, ఖమ్మం నుంచి 400, ఆదిలాబాద్ నుంచి 300, నిజామాబాద్ నుంచి 250, హైదరాబాద్ నుంచి 200 బస్సులు జాతర కోసం నడపాలని నిర్ణయించారు.

ఇక పెరిగిన బస్ ఛార్జ్ లు ఇలా ఉన్నాయి..

* హైదరాబాద్ నుంచి మేడారానికి వెళ్లాలంటే ఏసీ బస్సు ఛార్జీ రూ.710కు (పిల్లలకు రూ.540).
* సూపర్ లగ్జరీ ఛార్జీ రూ.550 (పిల్లలకు రూ.290), ఎక్స్‌ప్రెస్ ఛార్జీ అయితే రూ.440 (పిల్లలకు రూ.230) మిగతా ప్రాంతాల నుండి వచ్చే బస్సు ల ఛార్జ్ లు కూడా మునపటి కంటే రూ. 30 పెరిగాయి.